Telangana: తెలంగాణలో 34 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1269 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 350 దాటిన కరోనా మరణాలు

ఎప్పట్లాగే హైదరాబాద్ నగరం నుంచే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో 800 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, నగరానికి సమీపాన ఉండే మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలలో...

Telangana: తెలంగాణలో 34 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1269 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 350 దాటిన కరోనా మరణాలు
Coronavirus in India | (Photo Credits: PTI)

Hyderabad, July 12:  తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 30,946కి చేరుకుంది.

ఎప్పట్లాగే హైదరాబాద్ నగరం నుంచే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన మొత్తం కేసుల్లో 800 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా, నగరానికి సమీపాన ఉండే మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలలో నిత్యం వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రంగారెడ్డి నుంచి 132 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 94 కేసులు వచ్చాయి. మరోపక్క సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఈరోజు 36 కేసులు నమోదయ్యాయి.

ఆదివారం  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana's COVID Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు  గత 24 గంటల్లో మరో 8  కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 356 కు పెరిగింది.

అలాగే,  ఆదివారం  సాయంత్రం నాటికి మరో 1563 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో  22,482 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో  11,883 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది

గత 24 గంటల్లో 8,153 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,70,324 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jul 12, 2020 09:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).