Corona in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 152 పాజిటివ్ కేసులు, మరో 2 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో ప్రాధాన్యతా గ్రూప్ వయోజనులకు కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్

బుధవారం సాయంత్రం వరకు మరో 114 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,821 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1948 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది....

Corona in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 152 పాజిటివ్ కేసులు, మరో 2 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో ప్రాధాన్యతా గ్రూప్ వయోజనులకు కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్
Coronavirus Outbreak in TS (Photo Credits: IANS)

Hyderabad, March 4: తెలంగాణలో మార్చి 1 నుంచి మూడో విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది, ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ చేస్తున్నారు. అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్యాలుంటే వారు కోవిడ్ టీకా పొందేందుకు అర్హులు. బుధవారం నాడు అనుకున్న లక్ష్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 90 శాతం పైగానే వ్యాక్సిన్ పొందినట్లు ఆరోగ్యశాఖ నివేదిక పేర్కొంది.  తొలి డోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ 28 రోజుల తర్వాత రెండో డోసు టీకా తీసుకోవాల్సి ఉంటుంది.    తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 4,79,421 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 41,201 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 152 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 658 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,99,406కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 11, మరియు రంగారెడ్డి నుంచి 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,6357కు పెరిగింది.

మరోవైపు బుధవారం సాయంత్రం వరకు మరో 114 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,821 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1948 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Mar 04, 2021 09:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).