COVID Status in TS: తెలంగాణలో కోరోనా సెకండ్ వేవ్ సంకేతాలు లేవు, కొనసాగుతున్న కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా 168 పాజిటివ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు పబ్లిక్ హెల్త్ కేర్ ఆఫీసర్లు పేర్కొన్నారు. తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఏమి లేవని, రోజూవారీ కరోనా కేసులు సాధారణ స్థాయిలోనే ఉంటున్నాయని వారు స్పష్టం చేశారు....

COVID Status in TS: తెలంగాణలో కోరోనా సెకండ్ వేవ్ సంకేతాలు లేవు, కొనసాగుతున్న కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా  168 పాజిటివ్ కేసులు నమోదు
Representational Image | (Photo Credits: IANS)

Hyderabad, March 3: తెలంగాణలో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన పౌరులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే 45 ఏళ్లు పైబడిన వారితో పాటు హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే అనుకున్న దానిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో 94 శాతం వ్యాక్సినేషన్ జరిగగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 74 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 4,59,170 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.

ఇక రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు పబ్లిక్ హెల్త్ కేర్ ఆఫీసర్లు పేర్కొన్నారు. తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఏమి లేవని, రోజూవారీ కరోనా కేసులు సాధారణ స్థాయిలోనే ఉంటున్నాయని వారు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 40,444 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 168 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 786 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,99,254కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 15, మరియు రంగారెడ్డి నుంచి 13 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,635గా ఉంది.

మరోవైపు మంగళవారం సాయంత్రం వరకు మరో 163 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,707 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1912 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Mar 03, 2021 10:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).