Telangana's COVID Report: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 3018 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1,11,688కి చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య
జిల్లాల నుంచి కూడా వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నల్గొండ నుంచి 190, ఖమ్మం నుంచి 161, వరంగల్ అర్బన్ నుంచి 139, నిజామాబాద్ నుంచి 136, కరీంనగర్ నుంచి 127, మంచిర్యాల నుంచి 103, జగిత్యాల నుంచి 100 మరియు కొత్తగూడెం నుంచి 95 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి....
Hyderabad, August 26: తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది, ఈ నేపథ్యంలో కొత్తగా నిర్ధారించబడుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 61,040 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3018 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1176 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,82,094 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,11,688 కి చేరుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ఉధృతి ఓ మోస్తారుగా స్థిరంగా కొనసాగుతోంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 475 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అటు మేడ్చల్, రంగారెడ్డిలో కూడా కొత్తగా నమోదయ్యే కేసులు పెరిగాయి. నిన్న సాయంత్రం వరకు రంగారెడ్డి నుంచి నమోదైన కేసులు 247గా ఉండగా, మేడ్చల్ నుంచి 204 కేసులు నిర్ధారణయ్యాయి.
Telangana's COVID19 Bulletin:

ఆగష్టు 25న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 780 కు పెరిగింది.
అలాగే, మంగళవారం సాయంత్రం వరకు మరో 1060 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 85,223 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,685 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 26, 2020 09:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

