COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 340 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 359 మంది రికవరీ, రాష్ట్రంలో 5,891కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి పిల్లల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు పెరగకుండా సీఎం కేసీఆర్ అధ్వర్యంలో నేరుగా పరిస్థితుల పర్యవేక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు....

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా 340 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 359 మంది రికవరీ, రాష్ట్రంలో 5,891కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
COVID 19 Testing (Photo Credits: Pixabay)

Hyderabad, August 30: కోవిడ్19 థర్డ్ వేవ్ హెచ్చరికలు పెరుగుతున్న నేపథ్యంలో పెరిగే కేసులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటుంది. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు కూడా ప్రారంభం అవుతున్నాయి కాబట్టి పిల్లల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు పెరగకుండా సీఎం కేసీఆర్ అధ్వర్యంలో నేరుగా పరిస్థితుల పర్యవేక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజు 3 నుంచి 4 వందల మధ్య కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా ఇంచుమించుగా అదే స్థాయిలో ఉంటుంది. దీంతో రాష్ట్రంలోని ఆక్టివ్ కేసులు స్థిరంగా ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75,102 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 340 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,658 మంది శాంపుల్స్‌కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 6,57,716కి చేరుకుంది. ఈరోజు వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72 కేసులు నిర్ధారణ కాగా, కరీంనగర్ నుంచి 42 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,872కు పెరిగింది.

అలాగే సాయంత్రం వరకు మరో 359 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 6,47,953 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,891 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Aug 30, 2021 09:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).