Kamareddy Shocker: వెంటాడిన అనారోగ్య సమస్యలు, తట్టుకోలేక భార్యను చంపేసి ఉరివేసుకున్న భర్త, తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు

వెంటాడిన ఆనారోగ్య సమస్యల కారణంగా భార్యను చంపి ( Man Assassinated His Wife) ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Kamareddy Shocker: వెంటాడిన అనారోగ్య సమస్యలు, తట్టుకోలేక భార్యను చంపేసి ఉరివేసుకున్న భర్త, తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు
representational image (photo-Getty)

Kamareddy, May 26: వెంటాడిన ఆనారోగ్య సమస్యల కారణంగా భార్యను చంపి ( Man Assassinated His Wife) ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన శంకర్‌గారి సిద్ధయ్య (60), బాలమణి (58) దంపతులు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాలమణికి ఐదేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి ఎన్ని ఆస్పత్రులు తిరిగినా తగ్గలేదు.

ఉన్నచోటే ఆమెకు సపర్యలు చేస్తున్నారు. సిద్ధయ్య కూడా గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జీవితంపై విరక్తితో భార్యను చంపి తాను కూడా చనిపోతానని సిద్దయ్య పలుమార్లు కుటుంబ సభ్యులతో అనేవాడు. సోమవారం రాత్రి కొడుకు రాజు, కోడలు, మనవళ్లు అందరితో కలసి భోజనం చేసి పడుకున్నారు. కొడుకు రాజు ఉదయం లేచి చూసే సరికి తండ్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని (End His Life In Kamareddy) కనిపించాడు.

వివాహేతర సంబంధం మోజులో భర్త ఇల్లు గుల్ల చేసిన భార్య, రూ.63 లక్షల విలువైన బంగారం తీసుకుని ప్రియుడితో జంప్, ఇంట్లో చోరీ జరిగిందని భర్త ఫిర్యాదు, నిందితులిద్దర్నీ అరెస్ట్ చేసిన ఖమ్మం పోలీసులు

గదిలోకి వెళ్లి చూడగా తల్లి కూడా చనిపోయి ఉంది. బాలమణి పడుకున్న చోటే గొంతుకు చీరతో ఉరివేసి చంపినట్లుగా తెలుస్తోంది. అత్త కిటికీకి వేలాడుతుండటాన్ని పక్కింట్లో ఉండే కోడలు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు తెరిచింది. అప్పటికే ఇద్దరూ చనిపోవడంతో నిర్ఘాంతపోయారు. కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ తెలిపారు. కుమార్తె పెళ్లి కోసం ఇటీవలే గల్ఫ్‌ నుంచి వచ్చానని, నాలుగు రోజల క్రితమే పెళ్లి ఘనంగా జరిపించానని, ఇంతలోనే ఇలా జరిగిందని రాజు కన్నీటిపర్యంతమయ్యారు.

(The above story first appeared on LatestLY on May 26, 2021 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).