Telangana Shocker: మూగ యువతిపై తెగబడిన కామాంధులు..దారుణంగా అత్యాచారం, తండ్రికి సైగలతో చెప్పుకుని భోరున విలపించిన యువతి, మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం (Speech-impaired Girl gangraped by 3 minors ) జరిగింది. మాటలు సరిగా రాని ఆ యువతి కళ్లు సరిగా కనపడని అమ్మమ్మకు ఆసరాగా ఉంటున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Telangana Shocker: మూగ యువతిపై తెగబడిన కామాంధులు..దారుణంగా అత్యాచారం, తండ్రికి సైగలతో చెప్పుకుని భోరున విలపించిన యువతి, మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Warangal, June 14: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూగ యువతిపై సామూహిక అత్యాచారం (Speech-impaired Girl gangraped by 3 minors ) జరిగింది. మాటలు సరిగా రాని ఆ యువతి కళ్లు సరిగా కనపడని అమ్మమ్మకు ఆసరాగా ఉంటున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ (Telangana warangal) జిల్లా రంగశాయిపేటలో నివాసం ఉంటున్న మూగ యువతి (23) తల్లి గతంలోనే చనిపోయింది.

ఇటీవల తండ్రి పనిమీద బయటకెళ్లడంతో సమీపంలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి ఆమెకు తోడుగా ఉండేందుకు వెళ్లింది. ఆ యువతిపై కన్నేసిన ముగ్గురు బాలురు ఇంట్లోకి వచ్చి మాయమాటలు చెప్పి యువతిపై దారుణానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న అమ్మమ్మకు చూపు సరిగా లేకపోవడంతో ఆమెకు అనుమానం రాకుండా మాటల్లోకి దింపారు. ఒకరి తర్వాత ఒకరు మనవరాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

మహిళతో అక్రమ సంబంధం, భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కానిస్టేబుల్, నిందితుడిపై కేసు నమోదు, కృష్ణా జిల్లా కంచికచర్లలో దారుణ ఘటన

తండ్రి ఇంటికి రాగానే ఆ యువతి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. వెంటనే ఆయన మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.నిందితులైన బాలుర వయసు 15, 16 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురూ అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పథకం ప్రకారం ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.

(The above story first appeared on LatestLY on Jun 14, 2021 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).