Corona in Telangana: తెలంగాణలో 1 లక్షా 60 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, తాజాగా మరో 2,058 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 984కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus in India (Photo Credits: IANS)

Hyderabad, September 15:  తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో 51,247 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,058  మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 908 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,20,586 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,60,571కి చేరుకుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 277 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  రంగారెడ్డి నుంచి 143,  మేడ్చల్ నుంచి 97 కేసులు నిర్ధారణయ్యాయి.

రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ విజృంభన కొనసాగుతోంది,  పలు జిల్లాల నుంచి వందకు పైగా కేసులు నివేదించబడ్డాయి. నిన్న  కరీంనగర్ జిల్లా నుంచి అత్యధికంగా 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వరంగల్ అర్బన్ నుంచి 108, సిద్ధిపేట నుంచి 106,  ఖమ్మం నుంచి 103 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.
Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 10 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 984 కు పెరిగింది.

అలాగే,  సోమవారం సాయంత్రం వరకు మరో 2,180 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,29,187 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.