Khammam Shocker: రాత్రిపూట భర్త కళ్లముందే ప్రియుడితో భార్య..గంట తర్వాత భర్త అనుమానాస్పద స్థితిలో మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి (Wife allegedly murdered husband ) కడతేర్చిందనే వార్త ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనికెళ్ల గ్రామానికి చెందని భాస్కర్, జనార్దన్ స్నేహితులు.

Khammam Shocker: రాత్రిపూట భర్త కళ్లముందే ప్రియుడితో భార్య..గంట తర్వాత భర్త అనుమానాస్పద స్థితిలో మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన
representational image (photo-Getty)

Khammam, June 21: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి (Wife allegedly murdered husband ) కడతేర్చిందనే వార్త ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనికెళ్ల గ్రామానికి చెందని భాస్కర్, జనార్దన్ స్నేహితులు. మృతుడు భాస్కర్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కాగా గత రెండేళ్లుగా భాస్కర్ భార్యతో జనార్దన్ అక్రమ సంబంధం నడుపుతున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి జనార్దన్‌ను పలుమార్లు నిలదీశారు. కొన్ని రోజులు దూరంగా ఉండి మరలా రాధమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

శనివారం రాత్రి ఇంట్లో భార్య రాధమ్మ, ప్రియుడు జనార్దన్ కలిసి ఉండగా చూసిన భాస్కర్ అనంతరం గంట తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పథకం ప్రకారం ప్రియుడితో కలిసి రాధమ్మే హత్య చేయించిదని (Wife Murdered his Husband) మృతుని బంధువులు ఆరోపించారు.

పెళ్లిపత్రికలో తల్లిదండ్రుల పేర్లు వేయలేదని కత్తితో దాడి, నలుగురికి గాయాలు, హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొలీసులు

భాస్కర్ మృతికి కారకుడైన ప్రియుడు జనార్దన్ ఇంటిముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

(The above story first appeared on LatestLY on Jun 21, 2021 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).