Moon, Mars and Venus Conjunction: ఖగోళంలో అద్భుతం, ఒకేవరుసలో చంద్రుడు, బృహస్పతి, శుక్రుడు, సోషల్   మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు
Moon, Mars and Venus Conjunction (PIC@ Twitter)

New Delhi, May 25: అంతరిక్షంలో అద్భుతం జరిగింది. ఒకే వరుసలో చంద్రడు (Moon), బృహస్పతి(Mars), శుక్రుడు (Venus) కనిపించాయి. ఈ మూడు ఒకే కక్ష్యలోకి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలోకి (Moon, Mars and Venus Conjunction) రావడం చాలా అరుదైన సందర్భమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో ఔత్సాహికులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అద్భుతమైన, అరుదైన సన్నివేశాన్ని తమ కెమెరాల్లో బందించారు.

ఈ అరుదైన దృశ్యాలు చూడటం అదృష్టమంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. వందల ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ దృశ్యాన్ని చూడటం చాలా ఆనందంగా ఉందంటున్నారు.

ఈ దృశ్యాలు కేవలం భారత్‌లో మాత్రమే కాదు లండన్ తో పాటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించాయి.  వాటికి సంబంధించి వివిధ ప్రదేశాలకు చెందిన వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఖగోళ శాస్త్రవేత్తలు సైతం ఈ దృశ్యాలను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. వేర్వేరు దిశల్లో ఉండే మూడు గ్రహాలు ఒకే వరుసలో కనిపించడం చాలా అరుదుగా ఉంటుందంటున్నారు.