Abdul Rehman Makki: అంతర్జాతీయ ఉగ్రవాదిగా పాకిస్థాన్ టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, నిషేధిత జాబితాలో అతన్ని చేర్చిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి

పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని.. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి(UNSC) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.మ‌క్కీపై నిషేధం విధిస్తూ అత‌ని పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. అత‌ని ఆస్తుల‌ను స్తంభింప చేయ‌డంతో పాటు ఆయుధాల స‌ర‌ఫ‌రా చేయ‌కుండా, ట్రావెల్ చేయ‌కుండా ఆంక్ష‌లు విధించింది.

Abdul Rehman Makki: అంతర్జాతీయ ఉగ్రవాదిగా పాకిస్థాన్ టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, నిషేధిత జాబితాలో అతన్ని చేర్చిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి
Abdul Rehman Makki (Photo Credits: ANI)

New York, Jan 17: పాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని.. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి(UNSC) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.మ‌క్కీపై నిషేధం విధిస్తూ అత‌ని పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. అత‌ని ఆస్తుల‌ను స్తంభింప చేయ‌డంతో పాటు ఆయుధాల స‌ర‌ఫ‌రా చేయ‌కుండా, ట్రావెల్ చేయ‌కుండా ఆంక్ష‌లు విధించింది.పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ (Abdul Rehman Makki) మక్కీ భారత్‌లో, మరీ ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లో దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాడు.

ఇందుకోసం లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా వంటి ఇతర ఉగ్ర సంస్థలతో కలిసి నిధులను సేకరిస్తూ వాటిని ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడానికి, యువతను విధ్వంసం దిశగా నడిపించేందుకు ఉపయోగిస్తున్నాడు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా వంటి సంస్థల్లో మక్కీ నాయకత్వ స్థానంలో ఉన్నాడు.22 డిసెంబరు 2000 సంవత్సరంలో ఎర్రకోటపై జరిగిన దాడి, 1 జనవరి 2008లో జరిగిన రాంపూర్ దాడి, 26/11 ముంబై దాడి సహా పలు ఘటనల్లో మక్కీ హస్తం ఉన్నట్టు యూఎన్ఎస్‌సీ పేర్కొంది. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్లు, వేర్వేరు చోట్ల ఐదుగురు ముష్కరులను హతమార్చిన భద్రతా బలగాలు, లష్కరే తోయిబా, జైషే కీలక కమాండర్లు హతం

భార‌త్‌లో 26/11న‌ ఉగ్ర‌దాడికి మాస్ట‌ర్‌మైండ్ అయిన హ‌ఫిజ్ స‌యీద్‌కు మ‌క్కీ బావ అవుతాడు. 2022 జూన్‌లో Deputy Chief of Lashkar-e-Taiba మ‌క్కీని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్రతా మండ‌లి1267 అల్‌ఖైదాపై ఆంక్ష‌లు విధించే క‌మిటీ ముందు భార‌త్‌, అమెరికా ఉమ్మ‌డిగా తీర్మానం చేశాయి. కానీ, చైనా అడ్డుప‌డింది. ఎట్ట‌కేల‌కు ఐరాస అత‌డి పేరును నిషేధిత జాబితాలో చేర్చ‌డం ప‌ట్ల భార‌త్, అమెరికా సంతోషం వ్య‌క్తం చేశాయి.

అబ్దుల్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చైనా ఇన్నాళ్లూ అడ్డుకుంటూ వచ్చింది. భద్రతా మండలిలో తనకున్న అధికారాలతో భారత్ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు గండికొడుతూ వచ్చింది. చైనా తన అధికారాన్ని ఉపయోగించుకుని అడ్డగోలుగా అడ్డుకోవడంపై గతేడాది జూన్‌లో భారత్ దుమ్మెత్తి పోసింది. ఈ నేపథ్యంలో చైనా తాజాగా టెక్నికల్ హోల్డ్‌ను ఎత్తేసింది. దీంతో అబ్దుల్ రెహ్మాన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలోకి చేర్చేందుకు యూఎన్ భద్రతా మండలికి మార్గం సుగమమైంది.

(The above story first appeared on LatestLY on Jan 17, 2023 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).