Black Snow: నల్లటి మంచును చూశారా? ఇదిగోండి ఆ ప్రాంతాన్ని కమ్మేస్తున్న నల్లటి మంచు, భయాందోళనలో స్థానికులు, ఎక్కడో తెలుసా?

Russia, January 30:  శీతాకాలం తెల్లటి మంచు (Snow)ను చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదే మంచు భయంకరమైన నల్లటి మంచు(Black Snow)గా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది! అలాంటి ఘటనే తాజాగా రష్యా (Russia)లో వెలుగు చూసింది. సైబీరియా (Siberia)లోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌ (Omsukchan)లో ప్రకృతి కన్నేర్రకు నిదర్శనగా ఆ ప్రాంతమంతా నల్లటి దుప్పటి కప్పినట్లు మంచు కప్పేసింది. అదేంటి మంచు కురవడం సాధారణమే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కురిసే మంచు తెల్లగా కాకుండా నల్లగా కురుస్తూ ఆ ప్రాంత ప్రజలని భయపెడుతోంది.

అసలు విషయమేంటంటే.. బొగ్గు (Coal)తో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఓంసుచన్‌ (Omsukchan) ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ సహాయంతో ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తున్నారు. బొగ్గ ఆధారిత ప్లాంట్‌ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని నుంచి వెలువడే దుమ్ము, మసి వాతావారణంలో కలిసి కాలుష్యంగా మారింది. దీంతో ఆకాశం నుంచి పడుతున్న మంచు భూమిపై పడకముందే నల్లగా కాలుష్యంతో నిండిపోయిన ఆ ఆవరణంలోకి రాగానే.. అది కూడా నల్లగా మారి కురుస్తుంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ నల్లటి మంచుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొందరు స్వలాభం కోసం చేసే కొన్ని పనుల వల్ల ప్రకృతి ప్రకోపాన్ని గురికావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు పేరిట ప్రతి ఏటా మనం నష్టపోతూనే ఉన్నాం. కొందరు అంటుంటారు.. ప్రకృతితో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుందని ఇప్పుడు అదే జరుగుతోంది.