Egg Price Hike in Pakistan: పాకిస్తాన్‌లో ఒక్క కోడిగుడ్డు ధర రూ. 32 పై మాటే, ఒక్కసారిగా పెరిగిన ధరలతో ప్రభుత్వంపై తిరగబడుతున్న ప్రజలు
Representational Image (Photo Credits: Unsplash.com)

Karachi, Dec 26: పాకిస్థానీలో పౌల్ట్రీలో ఉపయోగించే సోయాబీన్‌ సరఫరా తగ్గిపోవడంతో, కోడి గుడ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్‌ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు.

క్రిస్మస్ పండగ వేళ అమెరికాలో కాల్పుల మోత, ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది. సోయాబీన్స్‌ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, ఇంకా నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్‌ పాకిస్థాన్‌ బిజినెస్‌ ఫోరం తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.