Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్లతో విరుచుకుపడిన రష్యా, 51 మంది మృతి, మరో 200 మందికి గాయాలు, సైనిక విద్యా కేంద్రంపై క్షిపణి దాడి

ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై మిసైళ్లతో విరుచుకుప‌డింది. ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై మరోసారి మిసైళ్లతో విరుచుకుపడిన రష్యా, 51 మంది మృతి, మరో 200 మందికి గాయాలు, సైనిక విద్యా కేంద్రంపై క్షిపణి దాడి
Russia Fires Missiles and Drones in Ukraine (Photo Credit: X/@ZelenskyyUa)

Kyiv, Sep 4: ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై మిసైళ్లతో విరుచుకుప‌డింది. ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ సీఎన్ఎన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు.  మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు

పోల్టావాలో ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యన్ ద‌ళాలు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు తనకు సమాచారం అందిందని అన్నారు. ఇక ఈ దాడి కార‌ణంగా టెలికమ్యూనికేషన్స్ ఇనిస్టిట్యూట్ భవనాలలో ఒకటి పాక్షికంగా ధ్వంసం అయిన‌ట్లు ప్రెసిడెంట్ పేర్కొన్నారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులు ఆ ప్రాంతాన్ని తాకాయి" అని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే మృతుల‌కు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు.ఈ సంద‌ర్భంగా రష్యా దాడి త‌ర్వాత త‌మ‌కు సహాయం చేస్తున్న వారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 04, 2024 11:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).