దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీ (Creta EV) కారును ఆవిష్కరించనున్నది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో దీన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. హ్యుండాయ్ నుంచి భారత్ మార్కెట్లోకి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. మార్కెట్ నుంచి ఉపసంహరించిన కోనా ఎలక్ట్రిక్ స్థానంలో క్రెటా ఈవీ (Creta EV) వస్తోంది.
...