Mumbai, JAN 02: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్రెటా ఈవీ (Creta EV) కారును ఆవిష్కరించనున్నది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో దీన్ని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. హ్యుండాయ్ నుంచి భారత్ మార్కెట్లోకి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ వెహికల్ ఇది. మార్కెట్ నుంచి ఉపసంహరించిన కోనా ఎలక్ట్రిక్ స్థానంలో క్రెటా ఈవీ (Creta EV) వస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఐయానిక్ 5 (Ioniq 5)తోపాటు టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లకు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Creta EV) గట్టి సవాల్ విసురుతుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ క్రెటా -2024 (2024 Hyundai Creta) మాదిరిగానే హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (Hyundai Creta Electric) వస్తోంది.
ఎలక్ట్రిక్ వర్షన్ కారు కోసం కొన్ని కీలక మార్పులు చేశారు. ఫ్రంట్‌లో బ్లాంక్డ్ ఔట్ గ్రిల్లె విత్ ఏ సెంటర్ మౌంటెడ్ చార్జింగ్ పోర్ట్, రేర్‌లో రీడిజైన్డ్ బంపర్, టెయిల్ టైల్స్, న్యూ 17- అంగుళాల ఏరో అల్లాయ్ వీల్స్ ఉంటాయని భావిస్తున్నారు. క్యాబిన్‌లో ఇన్‌ఫోటైన్ మెంట్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యుయల్ స్క్రీన్ సెటప్, ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) కౌంటర్ పార్ట్, ఐయానిక్ 5 లో మాదిరిగా న్యూ స్టీరింగ్ వీల్ డిజైన్, లెథరెట్టే డాష్ బోర్డ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పనోరమిక్ సన్ రూఫ్, సేఫ్టీ కోసం లెవల్ 2 అడాస్ ఫీచర్లు ఉంటాయి.
హ్యుండాయ్ క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ లతో వస్తున్నది. 51.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల ఇంజిన్ సింగిల్ చార్జింగ్ చేస్తే 473 కి.మీ, 42 కిలోవాట్ల బ్యాటరీ చార్జింగ్ చేస్తే 390 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. డీసీ ఫాస్ట్ చార్జింగ్ సాయంతో కేవలం 58 నిమిషాల్లో 10-80 శాతం చార్జింగ్ అవుతుంది. 11కిలోవాట్ల స్మార్ట్ కనెక్టెడ్ వాల్ బాక్స్ చార్జర్ సాయంతో చార్జింగ్‌కు నాలుగు గంటల సమయం పడుతుంది. 7.9 సెకన్లలో గంటకు 100 కి.మీ దూరం దూసుకెళ్తుంది. ఎకో, నార్మల్ స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్‌ల్లో క్రెటా ఈవీ లభిస్తుంది. హ్యుండాయ్ క్రెటా ఈవీ కారు ధర రూ.20-30 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఎంజీ జడ్ఎస్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మారుతి సుజుకి ఈ-విటారా, బీవైడీ అట్టో3 మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.