
Mumbai, FEB 21: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ (Tata Motors) మరో రికార్డు సృష్టిచింది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఈవీ కార్లను (EV Cars) విక్రయించిన సందర్భంగా కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. వచ్చే 45 రోజులపాటు కొనుగోలు చేసే ఈవీ మాడళ్లపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాలు కల్పిస్తున్నది. నూతన ఈవీని కొనుగోలు చేసేవారికి ఎక్సేంజ్ బోనస్ కింద రూ.50 వేలు, జీరో డౌన్‌పేమెంట్‌తో 100 శాతం ఫైనాన్స్, ఆరు నెలలపాటు నెక్సాన్.ఈవీ, కర్వీ.ఈవీలను ఆరు నెలలపాటు ఉచితంగా చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
7.2 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ చార్జర్‌ను ఇంట్లోనే ఇన్‌స్టాల్ చేసుకోనే వీలుంటుంది. 2027 నాటికి దేశవ్యాప్తంగా 4 లక్షల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి సంస్థ సిద్ధమైంది.