
Mumbai, FEB 28: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) భారత్ మార్కెట్‌లోకి తన ఎంజీ కామెట్ (MG Comet) బ్లాక్‌స్టోర్మ్ ఎడిషన్ కారును ఆవిష్కరించింది. హెక్టర్ (Hector), గ్లోస్టర్ (Gloster), ఆస్టర్ (Astor) తర్వాత ఎంజీ మోటార్స్ తీసుకొస్తున్న బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ ఎంజీ కామెంట్ నాలుగోది. టాప్ స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ (MG Comet Blackstorm Edition) కారు ధర రూ.7.80 లక్షలు పలికింది. ఎంజీ కామెట్ (MG Comet)తో పోలిస్తే ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ (MG Comet Blackstorm Edition)కారు ధర రూ.30,000 వేలు ఎక్కువ పలుకుతుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బ్లాక్ బ్యాడ్జెస్, డార్క్ క్రోమ్‌తోపాటు స్టారీ బ్లాక్ కలర్ స్కీంతో ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ (MG Comet Blackstorm edition) కారు వస్తోంది.
ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, అల్లాయ్ వీల్స్, డోర్లపై సైడ్ క్లాడింగ్ లోయర్ బంపర్ లిప్‌పై రెడ్ అసెంట్స్‌తోపాటు ఆల్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఫీచర్లు ఉంటాయి. టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం డ్యుయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, మాన్యువల్ ఏసీ, కీలెస్ ఎంట్రీ, పవర్డ్ ఓఆర్వీఎంస్ ఉంటాయి. నాలుగు స్పీకర్లతో కూడిన అప్‌గ్రేడెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ (MG Motor Blackstorm Edition) కారు ప్రయాణికుల సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తుంది.
అందుకోసం రెండు ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబూషన్ (ఈబీడీ)తోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఐసో ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ ఉంటాయి. ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ (MG Comet Blackstorm) కారు రేర్ వీల్ మౌంటెడ్ మోటార్‌తో వస్తున్నది. ఈ విద్యుత్ మోటార్ గరిష్టంగా 41 బీహెచ్‌పీ విద్యుత్, 110 ఎన్‌ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ కారులో 17.4 కిలోవాట్ల బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో ఈ కారు 230 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.