హాంకాంగ్‌లోని ఓ ఎత్తైన భవన సముదాయంలో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 94కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. 200 మందికి పైగా వ్యక్తులు ఇంకా కనుగొనబడలేదని సమాచారం. 72 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గత 60 ఏళ్లలో హాంకాంగ్‌లో చోటుచేసుకున్న అత్యంత ఘోర అగ్నిప్రమాదం ఇదేనని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భవనాలలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. మరమ్మతుల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న వెదురు స్కాఫోల్డింగ్, ఫోమ్ పదార్థాలు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమిక అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.

Hong Kong Fire:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)