HC on Wife Racial Remarks on Husband: భర్త న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించ‌డం క్రూర‌త్వ‌మే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
Karnataka High Court (Photo-PTI)

Wife calling hubbydark-skinned is cruelty:  భ‌ర్త‌ న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించడం క్రూర‌త్వం అవుతుంద‌ని క‌ర్నాట‌క హైకోర్టు తెలిపింది. లేనిపోని కార‌ణాల‌తో భ‌ర్త‌ను దూరంపెట్టిన‌ భార్య వైఖ‌రిని కర్ణాటక హైకోర్టు త‌ప్పుప‌ట్టింది. ఈ కేసులో విడాకులు మంజూరీ చేస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది.నల్లగా ఉన్నావంటూ భార్య పెడుతున్న వేధింపులు తట్టుకోలేక భర్త కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ కేసును విచారించిన కోర్టు న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భ‌ర్త‌ను వేధించ‌డం క్రూర‌త్వ‌మే అవుతుంద‌ని తీర్పు వెలువరించింది.

వాక్ స్వాతంత్య్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానంటే కుదరదు, దానికి పరిమితి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

త‌న వేధింపుల‌ను క‌ప్పిపుచ్చేందుకు భ‌ర్త‌పై భార్య లేనిపోని ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు కూడా కోర్టు పేర్కొంది. భ‌ర్త‌పై అక్ర‌మ సంబంధం ఆరోప‌ణ‌లు కూడా చేసిన‌ట్లు విచారణలో తెలిపింది. అక్ర‌మ రీతిలో భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు చేసిన భార్య.. క్రూర‌త్వానికి పాల్ప‌డిన‌ట్లే అని కోర్టు వెల్ల‌డించింది. హిందూ వివాహ చ‌ట్టంలోని సెక్ష‌న్ 13(ఐ)(ఏ) ప్ర‌కారం ఆ జంట‌కు విడాకులు జారీ చేశారు