Ex-Army man kills wife, chops body, boils in pressure cooker before discarding

Hyd, Jan 22: రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట‌లో భార్య‌ను దారుణంగా భ‌ర్త హ‌త‌మార్చిన ఘటన తీవ్ర భయోత్పాతాన్ని కలిగిస్తోంది. మీర్‌పేట పీఎస్‌ పరిధి జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై (Hyderabad Woman Murder Case) ఫొరెన్సిక్‌ బృందం ఘటనాస్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. ఈ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రస్తుతం నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతోనే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను పోలీసులు బేరీజు వేసుకుంటున్నారు. ఈ ఘటనతో కాలనీలోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. హత్య జరిగిన ఇంటికి చుట్టుపక్కల ఉన్నవాళ్లలో కొందరు తమ ఇళ్లకు తాళాలు వేసి బంధువుల వద్దకు వెళ్లిపోయారు.

హైదరాబాద్‌లో దారుణం, భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకించి ముక్కలను పొడి చేసిన భర్త, చివరకు ఎలా దొరికాడంటే..

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్‌ గురుమూర్తి (39), వెంకట మాధవి (35) భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం జిల్లెలగూడ న్యూ వేంకటేశ్వర కాలనీలోకి వచ్చి, అద్దె ఇంట్లో ఉంటున్నారు. గురుమూర్తి కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురుమూర్తి విపరీత ప్రవర్తన, అనుమానిస్తూ వేధిస్తుండటంతో భార్య మాధవి ఇబ్బందిపడుతూ ఉండేది. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ నెల 16న గురుమూర్తి, మాధవి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గురుమూర్తి ఆమెను పాశవికంగా (Ex-Army man kills wife)  హత్య చేశాడు.అయినా కసి తీరక ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పెద్ద కుక్కర్‌ తీసుకొచ్చి శరీర భాగాలను (boils in pressure cooker) ఉడకబెట్టాడు. తర్వాత ఎండబెట్టి, కాల్చాడు. ఇంట్లోనే రెండు, మూడు రోజుల పాటు రోకలి బండతో దంచి పొడిగా చేశాడు. ఆ పొడిని డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో కలిపేశాడు. మిగిలిన ఎముకల ముక్కలను సమీపంలోని జిల్లెలగూడ (చందన) చెరువులో పారేశాడు.

Ex-Army man kills wife, chops body, boils in pressure cooker

మాధవి తల్లి ఉప్పాల సుబ్బమ్మ తన కూతురు కనిపించకుండా పోయిందని ఈ నెల 18న మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే ఏమీ ఎరగనట్టుగా అత్తమామలతో పాటు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిపై నిఘా పెట్టారు. అతడి ప్రవర్తన, కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మీర్‌పేట్‌ సీఐ నాగరాజు తెలిపారు.

షాకింగ్ వీడియో, పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్న యువకుడు

భార్యను హత్య చేసిన గురుమూర్తి పోలీసులకు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు చిక్కకుండా పక్కా ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. శరీరంలోని ఎముకలను పొడిగా ఎలా మార్చాలని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో శోధించడంతో పాటు క్రైమ్, హర్రర్‌ సినిమాలు చూశాడు. ముందుగా వీధి కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చి చంపేశాడు. ముక్కలుగా నరికి, ఎముకలతో సహా కుక్కర్‌లో ఉడకబెట్టాడు. తర్వాత అదే తరహాలో భార్య శరీరాన్ని కూడా ముక్కలు చేసి, ఉడకబెట్టాడు. ఎండబెట్టి, కాల్చి పొడి చేశాడు. ప్రస్తుతం నిందితుడు గురుమూర్తి పోలీసుల అదుపులో ఉండగా, వారి పిల్లలు మేడ్చల్‌లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్టు తెలిసింది.