Hyd, Jan 22: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి డెడ్ బాడీని కుక్కర్ లో ఉడకపెట్టిన కసాయి భర్త ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో ఆమెను చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త, అనంతరం భార్య డెడ్ బాడీ పార్టులను జిల్లెలగూడ చెరువులో పడేసాడు. రాచకొండ కమిషనరేట్ పరిధి మీర్ పేటలో ఘటన చోటు చేసుకోగా నిందితుడిని DRDOలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీగా పనిచేస్తున్న గురుమూర్తిగా గుర్తించారు. మృతురాలుఆయన భార్య మాధవిగా గుర్తించారు. మృతురాని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.
ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి(EX- ఆర్మీ) వృత్తి రీత్యా DRDOలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ.. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో కలిసి నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొని వచ్చి ఆ ముక్కలను ఉడకబెట్టాడు. అనంతరం ఆ మొక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. ఆ విధంగా మృతదేహం పొడిని బకెట్‌లో తీసుకువెళ్లి జిల్లెలగూడ చెరువులో కలిపివేశాడు.
ఈనెల 13వ తేదీ మాధవి మిస్సింగ్ అయినట్టు మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలో తనకు ఏం తెలియదన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్ పేట్ పీఎస్‌కు మృతురాలి భర్త కూడా వెళ్లాడు. అయితే గురుమూర్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది.. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్‌లో విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మృతదేహం పొడి కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ముక్కలతో పాటు బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడం వల్ల ఆనవాళ్లు దొరకలేదు. పోలీసులు గురు మూర్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.