
Sircilla, Mar 11: రాజన్న సిరిసిల్ల (Sircilla Horror) జిల్లాలో ఘోరం జరిగింది. 17వ పోలీస్ బెటాలియన్ ఇన్ చార్జ్ కమాండెంట్ గంగారాం (Gangaram) ప్రమాదవశాత్తూ మృతి చెందారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. తన బ్యాచ్ మెంట్ అయిన సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లిన గంగారం.. లిఫ్ట్ మీద పడి మృతి చెందినట్లు బెటాలియన్ సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న డీఎస్పీ నివాసానికి గంగారాం సోమవారం రాత్రి వెళ్లారు. అయితే రాత్రి వేళలో వెలుతురు సరిగా లేకపోవడం, లిఫ్టు రాకపోయినా గేటు తెరచుకోవడంతో గంగారాం ఒకింత గందరగోళానికి గురయ్యారు.
Video Link:
https://x.com/ChotaNewsApp/status/1899313714412806351
అలా ప్రమాదం
నిజంగా లిఫ్ట్ వచ్చిందని భ్రమపడి.. మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ పై పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను డీఎస్పీతోపాటు పోలీసు సిబ్బంది సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతిచెందారని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు.
భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో