అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపులు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ సారి సీనియర్ స్థాయి అధికారులను కూడా కలుపుకొని దాదాపు 14 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని నివేదికలు చెబుతున్నాయి. ప్రాప్తి ఆన్ X అనే యూజర్ సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెజాన్‌లోని నా స్నేహితురాలు తన మేనేజర్‌తో సహా మొత్తం బృందాన్ని క్షణాల్లోనే తొలగించారనీ, వారు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే విధానం చాలా బాధాకరంగా ఉందని పేర్కొంది. ఈ తొలగింపులు విస్తృత స్థాయిలో జరిగాయని Q3, Q4 కోసం పని చేసిన పరీక్షా (టెస్టింగ్) బృందాలు మొదటగా ప్రభావితమయ్యాయని ఆమె తెలిపింది. అంతేకాకుండా, ఉద్యోగులను తొలగించిన వెంటనే వారి ల్యాప్‌టాప్‌లను తీసుకున్నారని కూడా తెలిపింది.

ఆగని లేఆప్స్, 8 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలు

నివేదికల ప్రకారం, అమెజాన్ కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీల వినియోగాన్ని వేగవంతం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ మార్పులు సంస్థను మరింత సన్నగా, వేగంగా, సాంకేతికంగా ఆధునికంగా మార్చడమే లక్ష్యమని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగాల తగ్గింపు ధోరణిలో అమెజాన్ తాజా చర్య మరో ముఖ్య ఉదాహరణగా నిలుస్తోంది. పరిశ్రమ నిపుణులు ఈ చర్యలను AI ఆధారిత పునర్వ్యవస్థీకరణ యుగం ప్రారంభంగా అభివర్ణిస్తున్నారు.

Amazon Layoffs

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)