Newdelhi, Nov 23: పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునేందుకుగానూ 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలుకాలని ఓలా (OLA) ఎలక్ట్రిక్‌ సంస్థ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంస్థ ఖర్చులను తగ్గించి, నిర్వాహక సామర్థ్యం పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే అన్ని విభాగాల నుంచి 500 మంది ఉద్యోగులకు గేట్ పాస్ ఇవ్వాలని సదరు సంస్థ నిర్ణయించినట్టు ఆ కథనాలు వివరించాయి. అయితే, ఈ విషయం పై ఓలా ఇంకా స్పందించలేదు. విద్యుత్తు ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ సంస్థ ప్రస్తుతం నష్టాలను చవిచూస్తున్న విషయం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)