CM Revanth Reddy shocking comments on Chandrababu(Photo Credits - btTV)

Delhi, Jan 23:  దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). పీవీ నర్సింహ రావు(PV), చంద్రబాబు నాయుడుకి కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు కనీసం కంప్యూటర్ ఆన్, ఆఫ్ చేయడం కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు.

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..అల్లు అర్జున్(Allu Arjun) ఎపిసోడ్ గురించి సైతం ప్రశ్నించారు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు అని ప్రశ్నించగా అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు తెలియదు.. మొత్తం తెలుసుకొని మాట్లాడాలి అని రేవంత్ హితవు పలికారు.

తొక్కిసలాటలో మహిళ చనిపోతే, అల్లు అర్జున్ 10-12 రోజులు వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు అన్నారు రేవంత్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయిందన్నారు. కేటీఆర్(KTR) ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తాడు... నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు అన్నారు.  తెలంగాణను వణికిస్తున్న చలి. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

దావోస్(Davos) వేదికగా అతి పెద్ద ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు రానుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో భారీ MOU చేసుకుంది తెలంగాణ సర్కార్. ఈ ఒప్పందంతో దాదాపు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులను నెలకొల్పనుంది సన్ పెట్రో కెమికల్స్.

CM Revanth Reddy shocking comments on AP CM Chandrababu

ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగం అవుతామని ప్రమాణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో భాగంగా తెలంగాణ పెవిలియన్ ను సందర్శించారు వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేష:  నిర్వాహకులు. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.