
Newdelhi, Mar 9: జనారణ్యంలోకి వణ్యప్రాణులు రావడం ఇటీవల తరచూ జరుగుతుంటుంది. ఏనుగులు, పులులు (Tigers), సింహాలు (Lions).. నివాస ప్రాంతాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి దుప్పటి కప్పుకొని ఇంటి బయట నిద్రపోతుండగా.. ఓ చిరుత పులి మెల్లగా సమీపానికి వచ్చింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వ్యక్తి మంచం వద్దకు వచ్చింది. అతడిపై దాడి చేస్తుందేమో అని అంతా అనుకొన్నారు. అయితే దూరం నుంచి మంచం పక్కన పడుకున్న కుక్కను టార్గెట్ చేసిన ఆ చిరుత పులి.. దాని వద్దకు చేరుకొంది. సమీపానికి రాగానే ఒక్కసారిగా కుక్క మెడ పట్టుకుని బయటికి లాక్కెళ్లిపోతుంది. కుక్క అరుపులతో నిద్రలేచిన ఆ వ్యక్తి.. పులి వెళ్లిన వైపు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే, ఇది ఎక్కడ జరిగింది అనే విషయం ఇంకా తెలియరాలేదు.
బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Here's Video:
అర్థరాత్రి ఇంట్లో పెద్ద పులి కలకలం..
ఓ వ్యక్తి నిద్రపోతున్న సమయంలో.. పెద్ద పులి సమీపానికి వచ్చి మంచం పక్కన పడుకున్న కుక్కను ఒక్కసారిగా మెడ పట్టుకుని బయటికి లాక్కెళ్లింది. భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. pic.twitter.com/KN3fBOTeWl
— ChotaNews App (@ChotaNewsApp) March 9, 2025
తిరుమలలో ఇలా..
తిరుమలలో మరోసారి చిరుత కలకలం (Leopard Spotted In Tirumala) రేగింది. తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర మొన్న తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇక, వారంరోజుల కిందట తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల వద్ద చిరుత సంచారంతో విద్యార్థులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.