Kolkata, JAN 22: ట్వీంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ (T20I cricket) లో భారత బౌలర్ (Indian bowler) అర్షదీప్ సింగ్ (Arshadeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా (Kolkata) లోని ఈడెన్ గార్డెన్ (Eden garden) లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్ ఈ ఫీట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు. యజువేంద్ర చాహల్ (Yazvendra Chahal) రికార్డును బద్దలు కొట్టాడు.
Arshdeep Singh Becomes Highest Wicket-Taker in T20Is for India
ARSHDEEP SINGH CREATES HISTORY! 🥶
- India's leading wicket taker in Men's T20I. pic.twitter.com/WKGNqIOXkW
— The Khel India Cricket (@TKI_Cricket) January 22, 2025
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రెండో వికెట్ తీయడం ద్వారా మొత్తం 97 వికెట్లతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా అర్షదీప్ నిలిచాడు. ఇప్పటివరకు హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ఉన్న యజువేంద్ర చాహల్ (96 వికెట్లు) రికార్డును అర్షదీప్ బద్దలు కొట్టాడు. తన 61వ టీ20 మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. అర్షదీప్, యజువేంద్ర చాహల్ తర్వాత వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో భువనేశ్వర్ కుమార్ (90), జస్ప్రీత్ బుమ్రా (89), హార్దీక్ పాండ్యా (89) ఉన్నారు.