Newdelhi, June 20: చలి కాలంలో ఎప్పుడైనా ఢిల్లీకి (Delhi) వెళ్లారా? కాలుష్యంతో (Air Pollution) కూడిన పొగమంచుతో రోడ్డు మీద పది నిమిషాలపాటు కూడా అక్కడ ఉండలేరు. అందుకే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్నిబట్టి దేశంలో వాయు కాలుష్యం ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ వాయుకాలుష్యం అంతకంతకూ పెరిగిపోతుంది. దీని కారణంగా 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్‌ఈఐ) సంస్థ వెలువరించిన తాజా నివేదికలో వెల్లడైంది. భారత్ లో 21 లక్షలమంది మరణించినట్టు ఈ నివేదిక వెల్లడించింది.
#AirPollution caused 8.1 million deaths in 2021 globally, 2.1 million in #India: Reporthttps://t.co/CPp7kt3FbK
— Economic Times (@EconomicTimes) June 19, 2024
వాయుకాలుష్యంతో మరణాలు ఇలా
- ప్రపంచవ్యాప్తంగా మరణాలు- 81 లక్షలు
- చైనాలో మరణాలు - 23 లక్షలు
- భారత్ లో మరణాలు - 21 లక్షలు
ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాలు ఇలా
- భారత్ - 1,69,400
- నైజీరియా - 1,14,100
- పాకిస్థాన్ - 68,100
- ఇథియోపియా - 31,100
- బంగ్లాదేశ్ - 19,100