Pawan Kalyan

Vijayawada, June 20: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన జనసేనా (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలి రోజునే పాలనలో తన మార్క్ ఏమిటో స్పష్టం చేశారు. విజయవాడలోని (Vijayawada) క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. తన పరిధిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో ఈ భేటీ నిర్వహించారు. ఆయా శాఖల పనితీరు, కీలకమైన ఫైల్స్ గురించి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు, అంతా అనుకున్న‌ట్లుగానే శ్రీ‌ల‌క్ష్మికి షాక్, గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న చాలా మందికి స్థాన‌చ‌లనం

తొలిరోజే టార్గెట్ ఫిక్స్

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలుగా భావించే పవన్ వాటి అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఈ క్రమంలోనే గ్రామాల్లోని రోడ్ల నిర్మాణం, మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడటంపై దృష్టిసారించాలని అధికారులకు  దిశా నిర్దేశనం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఈ మేరకు వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని ఒకవిధంగా  టార్గెట్ ఫిక్స్ చేశారు. త్వరలోనే  మరోసారి సమీక్ష నిర్వహిస్తానని అధికారులతో అన్నారు.

భర్త న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించ‌డం క్రూర‌త్వ‌మే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు