Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు.

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Road Accident (photo-Rep)

కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్‌కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో ఆదోని మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన భార్యా భర్తలు, కర్ణాటకలోని మాన్వికి చెందిన అక్కా తమ్ముళ్లు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తమిళనాడులో బస్సుల పరిస్థితి చూడండి... డోర్ ఓపెన్ అలాగే వెళ్తున్న డ్రైవర్, వైరల్‌గా మారిన వీడియో

మరో ఘటనలో ఎస్సార్‌ఎస్పీ కెనాల్‌లోకి కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో కుమారుడు మృతి చెందగా, తండ్రి కూతురు గల్లంతయ్యారు. తల్లిని స్థానిక రైతులు కాపాడారు. సంగెం మండలం తీగరాజు పల్లి వద్ద ఘటన జరిగింది. మేత రాజు పల్లి నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్‌ కుమార్‌ తన భార్య కృష్ణవేణి, కుమార్తె సాయి చరిత, కుమారుడు హర్షవర్ధన్‌తో కలిసి హన్మకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు.

మార్గమధ్యలో కారు డ్రైవ్‌ చేస్తున్న ప్రవీణ్‌కు గుండెపోటు రాగా, చికిత్స కోసం తిరిగి వరంగల్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు. గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానిక రైతుల సాయంతో కృష్ణవేణి బయటపడ్డగా.. కుమారుడు మృతి చెందాడు. కారుతో సహా ప్రవీణ్, సాయి చరిత నీటిలో గల్లంతయ్యారు. ప్రవీణ్‌, చైత్రసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Mar 11, 2025 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).