
Newdelhi, Mar 11: కదులుతున్న రైలులో (Train) ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇదీ అలాంటి ఘటనే. కదులుతున్న రైలు కిటికి (Window) పట్టుకుని వేలాడుతూ ఓ యువకుడు ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ తర్వాత రైలు వేగం తగ్గాక నేలపై దిగబోయి వెనక్కి పడిపోయాడు. ఈ ఘటన యూపీలోని కాస్గంజ్, కాన్ఫూర్ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, యువకుడి విన్యాసాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటివి చేసేముందు పెంచిన తల్లిదండ్రులను ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవుపలుకుతున్నారు.
Click Below Link For Video:
https://x.com/ChotaNewsApp/status/1899302084778053782
ముంబైలో ఇలా..
ముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్ లో ఆ మధ్య ఫర్హాత్ అజామ్ షేక్ అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. అతడి స్టంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఈ విన్యాసం చేసే సమయంలో ఫర్హాత్ అజామ్ షేక్ ఒక కాలు, చెయ్యి కోల్పోయాడు. ఇలాంటి సాహసాలు చేసి తనలాగా ఎవ్వరూ బాధపడొద్దని చెప్పడం తెలిసిందే.