AP Groups 2 Mains Exam Postponed, Government Considers Candidates Request(X)

Hyderabad, Mar 11: తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు (Group-2 Results Today) మంగళవారం ఎట్టకేలకు విడుదలకానున్నాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును టీజీపీఎస్సీ మంగళవారం విడుదలచేయనున్నది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలకాగా, 5 లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఫలితాలు

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-II పోస్టుల పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఫైనల్‌ కీ ఆధారంగా వెల్లడించారు. గ్రేడ్‌-II పోస్టుల భర్తీ కోసం నిరుడు నవంబర్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.

భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో