Youth Suicide Attempts In Medak (Credits: X)

Medak, Mar 11: మెదక్‌ కలెక్టరేట్‌ భవనం (Youth Suicide Attempts In Medak) వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి  మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య (Suicide) చేసుకుంటానని హల్‌ చల్‌ చేశాడు. అరగంటకుపైగా ఈ పరిణామం చోటు చేసుకోగా... సిబ్బంది హామీతో ఎట్టకేలకు కిందకు దిగాడు. ఈ పరిణామంతో కలెక్టరేట్ లో పనులనిమిత్తం వచ్చిన పలువురు ఒకింత ఆందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

Click Below Link For Video:

https://x.com/ChotaNewsApp/status/1899276894467731457

జనగామలో ఇలా

జనగామ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి మరో యువకుడు ఇలాగే కొద్దిరోజుల కిందట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పురుగుల మందు తాగి నిమ్మల నర్సింగరావు అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తన భూమిని ఇతరుల పేరు మీద పట్టా చేశారని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆత్మహత్యకు యత్నించిన నర్సింగరావును పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Suicide Prevention and Mental Health Helpline Numbers: 

Men's Helpline Numbers:

Milaap: 9990588768; All India Men Helpline: 9911666498; Men Welfare Trust: 8882498498.

Suicide Prevention and Mental Health Helpline Numbers:

Tele Manas (Ministry of Health) – 14416 or 1800 891 4416; NIMHANS – + 91 80 26995000 /5100 /5200 /5300 /5400; Peak Mind – 080-456 87786; Vandrevala Foundation – 9999 666 555; Arpita Suicide Prevention Helpline – 080-23655557; iCALL – 022-25521111 and 9152987821; COOJ Mental Health Foundation (COOJ) – 0832-2252525.