Hotel Roof Collapses in Tirupati (Credits: X)

Tirupati, Mar 11: తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలో (Tirupati) ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్  కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్‌ ఊడిపడింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘట గురించి తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు.. హోటల్ లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత హోటల్ ను కూడా సీజ్ చేశారు.  ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

For Video.. Click Below Link: 

https://x.com/bigtvtelugu/status/1899285909742444668

మొన్నటికి మొన్న ఇలా..

తిరుపతి జిల్లాలోని గూడూరులో ఆదివారం తెల్లవారుజామున తృటిలో మరో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి తిరుపతి  వెళ్లే మార్గంలో రైలు పట్టా ఒకటి విరిగిపోయింది. ఈ క్రమంలోనే గొర్రెలు కాసేందుకు అటుగా వెళ్లిన ఓ గొర్రెల కాపరి పట్టా విరిగి ఉండటాన్ని  గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.