Telangana is Rich state, AP is poor state says CM Chandrababu(X)

Hyd, Jan 23:  దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra babu) ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ధనిక రాష్ట్రం.. ఏపీ పేద రాష్ట్రం అన్నారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..తెలంగాణ స్టేట్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ఇండియా అన్నారు. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.. వాళ్లు రిచ్.. మేము పూర్ అని చెప్పుకొచ్చారు.

దావోస్(Davos) పర్యటనలో భాగంగా బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. అలాగే అపోలో టైర్స్ వైస్ ఛైర్మన్ నీరజ్ కన్వర్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఏపీలో టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు లోకేశ్.  చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్‌,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్

మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు బిల్ గేట్స్.

Telangana is Rich state, AP is poor state says CM Chandrababu

దావోస్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) పై ఆసక్తికర కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). పీవీ నర్సింహ రావు(PV), చంద్రబాబు నాయుడుకి కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు కనీసం కంప్యూటర్ ఆన్, ఆఫ్ చేయడం కూడా తెలియదు అని వ్యాఖ్యానించారు.