Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో.. నిర్మాణ స్థలంలో క్రేన్, జేసీబీ కూలి సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి..

Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం వీడియో ఇదిగో.. నిర్మాణ స్థలంలో క్రేన్, జేసీబీ కూలి సైట్ ఇంజనీర్ సహా ముగ్గురు మృతి..
Tirupati Crane Accident

Tirupati Crane Accident: తిరుపతి నగరంలోని డీబీఆర్‌ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో క్రేన్, జేసీబీ విరిగిపడి ప్రమాదవశాత్తు కార్మికులపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీ కన్వెన్షన్ పక్కనే ఉన్న స్థలంలో 'నంది గ్రూప్ ఆఫ్ హోటల్స్' ఆధ్వర్యంలో నూతన భవన నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా సుమారు 30 అడుగుల లోతులో పునాదులు తీసే పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మట్టి తోలుతున్న జేసీబీ, క్రేన్ అకస్మాత్తుగా విరిగిపడి కింద పనిచేస్తున్న వారిపై కూలిపోయాయి.  వీడియో ఇదిగో.. తెలంగాణలో ఘోర అగ్నిప్రమాదం.. కష్టపడి దాచుకున్న రూ.20 లక్షలు, 4 తులాల బంగారు ఆభరణాలు క్షణాల్లో బూడిద..

ఈ దుర్ఘటనలో ఒడిశాకు చెందిన వలస కూలీ రామారావు, శ్రీకాకుళానికి చెందిన సైట్ ఇంజనీర్ సందీప్, తిరుపతికి చెందిన సెక్యూరిటీ గార్డు గంగయ్య (45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన బీహార్‌కు చెందిన షేక్ ఫర్హాన్, నౌషాన్ మరియు మల్లవరానికి చెందిన మురుగయ్యలను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందడం ఎంతో బాధాకరమని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Tirupati Crane Accident:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 29, 2026 05:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).