Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో
బ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదం(Plane Crash)లో మరణించారు. కానీ ఆ ఇద్దరికి చెందిన ఓ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది
Brazil, AUG 09: బ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండగా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్రమాదం(Plane Crash)లో మరణించారు. కానీ ఆ ఇద్దరికి చెందిన ఓ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై 29వ తేదీన జరిగిన ప్రమాదంలో.. 42 ఏళ్ల గేరన్ మాయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్‌కో మాయా ప్రాణాలు కోల్పోయారు. అడవిలో ఆ విమానం కూలింది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆ ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు జరిగిందా లేదా గతంలో తీసిన వీడియోనా అన్న విషయం తేలలేదు.
Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup
— D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023
మాయా బీరు తాగుతున్న సమయంలో.. అతని కొడుకు విమాన కంట్రోలింగ్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. విమానాన్ని ఎలా నడపాలో కూడా తన కుమారుడికి ఆ తండ్రి నేర్పుతున్నట్లు వీడియోలో ఉంది. ప్లేన్ కంట్రోలింగ్ గురించి తాగుతూ వివరించాడు.
(The above story first appeared on LatestLY on Aug 09, 2023 10:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

