Stock Limits On Tur Urad Dal: కందిపప్పు, మినపపప్పు నిల్వలపై కేంద్రం పరిమితులు, రేట్లు పెరిగే అవకాశముందని ప్రజల్లో ఆందోళన
దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది.