Huawei Triple Foldable Phone

New Delhi, March 06: ఫోల్డబుల్ ఫోన్ల గురించి తెలుసు. కీ ప్యాడ్ మొబైల్స్, స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసు కానీ...ఇది అంతకు మించి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు మడతల్లో వస్తుంది. సాధారణంగా ఒకటి లేదా రెండు మడతల్లో ఫోన్లను చూసి ఉంటారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ మాత్రం మూడు మడతలుగా ఓపెన్ చేయొచ్చు. ఇంతకీ ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ (Triple Foldable Phone) తయారుచేసిన కంపెనీ ఏంటో తెలుసా? హువావే సంస్థ. ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ అంట. ఈ కొత్త ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ మేట్ ఎక్స్‌టీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల అయింది. వాస్తవానికి, ఈ హువావే ఫోన్ గత ఏడాదిలోనే చైనాలో విడుదల అయింది.

Huawei Triple Foldable Phone

 

కానీ, అక్కడి మార్కెట్‌కే పరిమితమైపోయింది. ఇప్పుడు ఆ మూడు మడతల ఫోన్ డిమాండ్ పెరగడంతో అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో విశేషం ఏమింటంటే.. మడత పెట్టినప్పుడు ఈ ఫోన్ 6.4 అంగుళాల కవర్ స్ర్కీన్‌తో మామూలు స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే కనిపిస్తుంది.

Samsung Galaxy M16 5G Specifications: తక్కువ బడ్జెట్‌లో పవర్‌ఫుల్‌ 5G ఫోన్ తెచ్చిన శాంసంగ్, మార్కెట్లోకి గెలాక్సీ M16, గెలాక్సీ M06 5G ఫోన్లు, ధరతో పాటూ పూర్తి వివరాలివిగో.. 

ఒక మడత విప్పితే స్ర్కీన్ 7.9 అంగుళాలకు మారుతుంది. మరో మడత ఓపెన్ చేస్తే.. 10.2 అంగుళాలకు విస్తరిస్తుంది. మొత్తం ఫోల్డ్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. మూడు మడతలు ఓపెన్ చేస్తే ల్యాప్‌టాప్ అంతా స్ర్కీన్ మాదిరిగా మారిపోతుంది అనమాట.. అప్పుడు ఈ ఫోన్ పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్‌సెట్ మందం కేవలం 3.6మి.మీ మాత్రమే ఉంటుంది.

చైనా బయటి మార్కెట్లలో Mate XT ఫోల్డబుల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని హువావే ధృవీకరించింది. ఈ ఫోన్ యూరప్‌లో EUR 3,499 (సుమారు రూ. 3,18,200), యూఏఈలో AED 12,999 (సుమారు రూ. 3,07,700) ధరకు లభ్యమవుతుంది. భారతీయ వినియోగదారులకు ఈ మడతబెట్టే ఫోన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.