ఈ కేసులో కుటుంబ కోర్టు భార్యకు నెలకు రూ.2,500 తాత్కాలిక భరణం చెల్లించాలని ఆదేశించిన తీర్పును సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో పిటిషన్ నమోదు చేశారు. అయితే, కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.
భార్య, చిన్న పిల్లల సంరక్షణకు అవసరమైన ఆర్థిక సాయం చేయడం భర్తకు తప్పనిసరి బాధ్యత అని హైకోర్టు పేర్కొంది. శారీరక సామర్థ్యం ఉన్న భర్త పని చేసి అయినా ఆదాయం సంపాదించి ఈ బాధ్యతను నిర్వర్తించవలసి ఉంటుందని తీర్పులో హైలైట్ చేసింది. చట్టంలో నిర్దిష్టంగా పేర్కొన్న ప్రత్యేక పరిస్థితులు మినహా, భరణం చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం లేదని కోర్టు వివరించింది. ఇలాంటి భరణం కేసులు భర్తను శిక్షించడం కోసం కాకుండా, ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లే భార్యను రక్షించడానికి ఉద్దేశించబడ్డవని న్యాయస్థానం స్పష్టం చేసింది.