Representative Image (Photo Credit: PTI)

Guwahati, JAN 22: కొందరు యువకులు పిక్నిక్‌కు వెళ్లారు. ఆవును వెంట తీసుకెళ్లారు. దానిని కోసి వండుకుని తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. (6 Arrested For Killing A Cow) అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అసల్పారా గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఇటీవల బోటులో పిక్నిక్‌కు వెళ్లారు. ఆవు, దానిని వధించే కత్తులు, వంట పాత్రలను తమ వెంట తీసుకెళ్లారు. ఒక చోట ఆవును కోసి దాని మాంసాన్ని వండుకుని తిన్నారు. తమ పిక్నిక్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Kidney Racket Busted in Hyd: హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేధించిన పోలీసులు, అల్కనంద మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు 

కాగా, ఈ వీడియో క్లిప్స్‌ వైరల్‌ అయ్యాయి. దీంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అస్సాం పశు సంరక్షణ, పశువుల అక్రమ వధ, వ్యాపార నిషేధిత చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను సాహిల్ ఖాన్ (20), హఫీజుర్ ఇస్లాం (19), రోకిబుల్ హుస్సేన్ (20), సాహిదుల్ ఇస్లాం (30), ఇజాజ్ ఖాన్ (26), జాహిదుల్ ఇస్లాం (24)గా గుర్తించి వారిని అరెస్ చేశారు.