
New Delhi, FEB 27: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత్ మార్కెట్‌లో రెండు గెలాక్సీ ఫోన్లు ఆవిష్కరించింది. వాటిల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం 16 5జీ (Samsung Galaxy M16 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు రెండు మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity 6300) చిప్‌సెట్లు, 5000 ఎంఏహెచ్ (5,000mAh) సామర్థ్యం గల బ్యాటరీలతో ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా, శాంసంగ్ గెలాక్సీ ఎంo6 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G) ఫోన్‌లో ఆరేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,499, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,499 పలుకుతుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. బ్లష్ పింక్ (Blush Pink), మింట్ గ్రీన్ (Mint Green), థండర్ బ్లాక్ (Thunder Black) రంగుల్లో లభిస్తుంది. మార్చి ఐదో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్ రూ.9,499, 6జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 10,999 లకు లభిస్తాయి. సెలెక్టెడ్ బ్యాంకు డెబిట్ / క్రెడిట్ కార్డులపై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ బ్లేజింగ్ బ్లాక్, సాగే గ్రీన్ రంగుల్లో లభిస్తుంఇ. మార్చి ఏడో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. అమెజాన్ ద్వారా ఫోన్‌లు విక్రయిస్తారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G) ఫోన్‌పై ఆరేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని ధృవీకరించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G)ఫోన్‌పై నాలుగేండ్లు ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G) ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080×2,340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్ 6.7- అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్స్) స్క్రీన్ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్లు రెండూ మీడియాటెక్ డైమెన్సిటీ 6500(MediaTek Dimensity 6300) ప్రాసెసర్‌తో వస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ (Samsung Galaxy M16 5G) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. అందులో 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 2- మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం06 5జీ (Samsung Galaxy M06 5G) ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
అథంటికేషన్ కోసం రెండు ఫోన్లలోనూ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు ఉన్నాయి. ఫైల్స్, ఇమేజ్‌లు త్వరితగతిన షేర్ చేయడానికి సెక్యూరిటీ కోసం శాంసంగ్ నాక్స్ వాల్ట్ ఫీచర్ ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం16 5జీ ఫోన్‌లో శాంసంగ్ వాలెట్ విత్ టాప్ అండ్ పే ఫంక్షనాలిటీ ఫీచర్ ఉంటుంది. రెండు ఫోన్లలోనూ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి.