Samsung Galaxy F06 5G

New Delhi, FEB 12: ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శాంసంగ్‌ (Samsung) భారత్‌లో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 06 (Samsung Galaxy F06 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. దీన్ని రూ.10వేల్లోపే తీసుకురావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్‌ విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 90Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ బ్యాటరీ, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. బహమా బ్లూ, లిట్‌ వయలెట్‌ రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ రిపిల్‌ గ్లో ఫినిష్‌తో వస్తోంది. ఫోన్‌పై లైట్‌ పడినప్పుడు అది మెరుస్తుంది.

Vivo V50 India Launch Date: సరికొత్త ఏఐ ఫీచర్లతో వివో వీ 50, ఈ నెల 17న భారత మార్కెట్లో ఆవిష్కరణ, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి 

సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో వస్తోంది. ఇందులో శాంసంగ్‌ వాయిస్‌ ఫోకస్‌ ఫీచర్‌ ఉంది. తద్వారా కాల్స్‌ మాట్లాడేటప్పుడు బయటి శబ్దాలను నిరోధిస్తుంది. మొత్తం 12 5జీ బ్యాండ్లకు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Samsung Galaxy F06 5G 

 

రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ లభిస్తుంది. 4జీబీ+128జీబీ ధర రూ.9,999 కాగా, 6జీబీ+128 జీబీ ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. రూ.500 ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. శాంసంగ్‌ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్‌లలో ఈ నెల 20 నుంచి విక్రయాలు జరగనున్నాయి.