Infosys

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు హైబ్రిడ్ విధానం లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.కరోనా తరువాత అనేక ఐటీ కంపెనీలు హైబ్రిడ్ మోడల్‌ అమలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ గతంలో వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని సూచించింది. ఇప్పుడు, ప్రతి నెల 10 రోజులు కార్యాలయానికి రావడం తప్పనిసరి చేస్తున్నట్లు తెలిసింది.

రూ. 25 వేల పరిహారం ఇచ్చి 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్, వెంటనే క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు, బలవంతంగా సంతకాలు..

మార్చి 10 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.అటెండెన్స్ కోసం ఉపయోగించే మొబైల్ యాప్ ఇకపై డిఫాల్ట్‌గా వర్క్ ఫ్రం హోమ్ అనుమతించదని, నిర్దేశిత రోజుల్లో కార్యాలయానికి హాజరుకావాల్సిందేనని అధికారులు పేర్కొన్నారు. రాని రోజులు సెలవులుగా పరిగణిస్తారు. అయితే, సంస్థ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.