Representational image (Photo Credit- ANI)

Bengaluru, Dec 26: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ హైరిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మంది ప్రయాణికులు కోవిడ్‌కు పాజిటివ్‌గా (COVID-19 Scare in India) తేలడంపై కర్ణాటక ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు వర్గాలు సోమవారం ధృవీకరించాయి.అధికారుల ప్రకారం, చైనా నుండి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తి బెంగళూరులో కోవిడ్‌కు పాజిటివ్ నిర్థారణ అయింది. మిగతా 11 మంది ప్రయాణికులు కోవిడ్ హైరిస్క్ దేశాల నుంచి వచ్చారు. వారిలో నలుగురిని ప్రైవేట్ ఆసుపత్రిలో క్వారంటైన్ చేయగా, మిగిలిన ప్రయాణికులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.

అన్ని నమూనాలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి జెనోమిక్ సీక్వెన్సింగ్‌కు పంపారు.ఫలితాలు సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం వరకు రానున్నాయి. చైనా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందినవాడు.గత మూడు రోజుల్లో విమానాశ్రయానికి చేరుకున్న 12 మందికి కోవిడ్ పరీక్షల్లో (China-Returnee Among 12 Passengers) పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ పరిణామంపై ఆందోళన చెందింది. ఫలితాల కోసం వేచి ఉంది.

కరోనా ఫోర్త్ వేవ్ భయం, మళ్లీ వర్క్ ఫ్రమ్ హోంకి అందరూ రెడీ, వచ్చే ఏడాది మొత్తం ఇంటి నుండి పనిచేసే విధంగా ఆలోచన చేస్తున్న కంపెనీలు

కొత్త కోవిడ్ మార్గదర్శకాలను ఈ సాయంత్రం లేదా మంగళవారం ఉదయం విడుదల చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆర్. అశోక్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అంతర్జాతీయ విమానాలను నిషేధించడం లేదా లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

బీహార్‌‌లో 5 మంది విదేశీయులకు కరోనా, చైనా నుంచి బెంగుళూరుకు వచ్చిన వ్యక్తికి పాజిటివ్, దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు నమోదు

ముందు జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చిస్తామని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అశోక్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.