traffic Police (photo-X/hydpolice)

Hyderabad, March 07: మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ వెల్ల‌డించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో పరేడ్‌ గ్రౌండ్‌ వైపు ఉన్న దారుల్లో ఆంక్షలు విధిస్తున్నామని, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌న్నారు.

Telangana: ప్రజాభవన్‌లో ఆల్‌ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా  

టివోలి క్రాస్‌ రోడ్స్‌ నుంచి ప్లాజా క్రాస్‌ రోడ్స్‌ వరకు రోడ్డు మూసివేయ‌నున్నారు. ఇక పంజాగుట్ట – గ్రీన్‌ల్యాండ్స్ – బేగంపేట – సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ మార్గంలో వెళ్లాల‌నుకునే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూసుకోవాల‌న్నారు.

ఆలుగడ్డ బావి, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్‌ క్రాస్‌ రోడ్‌ వైపు, క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ, పారడైజ్‌ మీదుగా మళ్లిస్తామని తెలిపారు. తుకారాంగేట్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయింట్‌ జాన్స్‌ రోటరీ వైపు.. సంగీత్‌, క్లాక్‌ టవర్‌, ప్యాట్నీ, పారడైజ్‌ మీదుగా మళ్లిస్తామన్నారు.

Telangana: ప్రజాభవన్‌లో ఆల్‌ పార్టీ ఎంపీల సమావేశం.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం, కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండా 

సంగీత్‌ క్రాస్‌ రోడ్స్‌ నుంచి బేగంపేట్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను వైఎంసీఏ నుంచి క్లాక్‌ టవర్ వైపు ప్యాట్నీ, పారడైజ్‌, సిటిఓ, రసూల్‌పుర నుంచి బేగంపేట వైపున‌కు మళ్లించ‌నున్నారు.

బేగంపేట నుంచి సంగీత్‌ క్రాస్‌ రోడ్స్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బలామ్‌రాయి, బ్రూక్‌బాండ్‌, టివోలి, స్వీకార్ ఉప్‌కార్‌, వైఎంసిఎ, సెయింట్ జాన్స్‌రోటరీ నుంచి సంగీత్‌వైపు మళ్లిస్తారు. బోయిన్‌పల్లి, తాడ్‌బంద్‌ నుంచి టివోలి వైపున‌కు బ్రూక్‌ బాండ్‌ మీదుగా సిటిఓ, రాణిగంజ్‌, టాంక్‌బండ్ మీదుగా మళ్లిస్తారు.

కార్ఖానా, జేబీఎస్‌ నుంచి ఎస్‌బిహెచ్‌ ప్యాట్నీ వైపు వెళ్లే వాహనాలను స్వీకార్‌ ఉప్‌కార్‌ వద్ద వైఎంసిఏ, క్లాక్‌టవర్‌, ప్యాట్నీ మీదుగా టివోలి వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకార్‌ఉప్‌కార్‌, ఎస్‌బిహెచ్‌ వైపుకు రానివ్వ‌కుండా, క్లాక్‌టవర్‌, వైఎంసిఏ, సిటిఓ వైపు మళ్లిస్తారని తెలిపారు.