Hyderabad, Apr 6: తుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ (Congress) జన జాతర బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు (Traffic) భారీ ఏర్పాట్లు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి పెద్దగోల్కొండ దారిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సాధారణ వాహనాలకు అనుమతి లేదు. శ్రీశైలం వైపునకు వెళ్లే సాధారణ వాహనాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడమవైపు తిరిగి ఆగాఖాన్ అకాడమీ, విజయాడెయిరీ, గాంధీ బొమ్మ, రావిర్యాల, వండర్‌లా జంక్షన్, తిమ్మాపూర్, రాచులూరు నుంచి రాచులూరు గేటు మీదుగా వెళ్లాలి.
శ్రీశైలం రహదారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారు మహేశ్వరం గేటు వద్ద ఎడమవైపు తిరిగి మన్‌సాన్‌పల్లె, నాగారం, పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్ కు చేరుకోవాలి. సభ నేపథ్యంలో తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద సాధారణ వాహనాలను కిందకు దిగడానికి అనుమతించరు.