Notices to Dead Person: పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదు? ఏడాది కిందట మరణించిన టీచర్‌ కు షోకాజ్‌ నోటీసులు.. అసలెక్కడ జరిగింది?

ఏడాది కిందట మరణించిన ఓ టీచర్ కు తెలంగాణలోని మేడ్చల్ విద్యాశాఖ అధికారులు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదో కారణాలు వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Notices to Dead Person: పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదు? ఏడాది కిందట మరణించిన టీచర్‌ కు షోకాజ్‌ నోటీసులు.. అసలెక్కడ జరిగింది?
Dead (Credits: X)

Hyderabad, Apr 6: ఏడాది కిందట మరణించిన ఓ టీచర్ (Teacher) కు తెలంగాణలోని (Telangana) మేడ్చల్ విద్యాశాఖ (Education Department) అధికారులు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదో కారణాలు వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌ నగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ లో ఎన్‌. గీత 2016-2023 వరకు సాంఘిక శాస్త్రం టీచర్‌ గా పనిచేశారు. 2023 మే నెలలో క్యాన్సర్‌ వ్యాధితో ఆమె మృతి చెందారు. అయితే, పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి  రాని దాదాపు 385 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ వాట్సాప్ లో నోటీసులు ఇచ్చింది. ఇందులో గీత నంబర్  కూడా ఉండటం సంచలనంగా మారింది.

Dead (Credits: X)

(The above story first appeared on LatestLY on Apr 06, 2024 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).