CM Revanth Reddy Attends At Padmashali Mahasabha In Nampally Exhibition Grounds(X)

Hyd, Dec 09:  పద్మశాలీ సోదరులు త్యాగంలో ఎప్పుడూ ముందుంటారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి మహాసభ (Padmashali Mahasabha)జరుగగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం..దీనికి ప్రత్యక్ష నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆయన పదవిని త్యాగం చేశారు అని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన తన సొంత ఇంటినే ఇచ్చేశారు అన్నారు.

అలాంటి వ్యక్తి మరణిస్తే గత ప్రభుత్వం నివాళులు అర్పించని సంఘటనను పద్మశాలి సమాజం మరిచిపోలేదు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మరో వ్యక్తి టైగర్ ఆలే నరేంద్ర అని... ఆలే నరేంద్రను కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిని చేస్తే.. ధృతరాష్ట్ర కౌగిలితో కెసీఆర్ ఆయన్ను ఖతం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అన్నారు(Nampally Exhibition Grounds).

ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు కార్మికుల జాడ కనిపెట్టిన క్యాడవర్‌ డాగ్స్‌.. సర్వత్రా సస్పెన్స్ (వీడియో) 

ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే మా ప్రభుత్వ విధానం అన్నారు. కేంద్రంతో మాట్లాడి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమేకాదు… దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం అన్నారు. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి(Asifabad medical college) కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటిస్తున్నాం అన్నారు. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి అప్పగిస్తున్నా అని చెప్పారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే 600 కోట్ల విలువైన 1కోటి 30 లక్షల చీరల ఆర్డర్ ను నేతన్నలకు ఇచ్చి చేనేతను ఆదుకుంటున్నాం…మీరు అడిగింది ఇవ్వడమే నా కర్తవ్యం అన్నారు. నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి సేవ చేయడమే తప్ప నాకు మరో ఆలోచన లేదు... అభిమానంతో నన్ను గుండెల్లో పెట్టుకుంటే మీ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పారు.

CM Revanth Reddy Attends At Padmashali Mahasabha In Nampally Exhibition Grounds

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించి బలహీనవర్గాల లెక్క తేల్చాం..ఇది ఇష్టం లేని వారు లెక్కలు తప్పని మాట్లాడుతున్నారు, కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తే మోదీ మెడపై కత్తిలా వేలాడుతుందని బీఆర్ఎస్, బీజేపీ లెక్కలు తప్పు అని మాట్లాడుతున్నాయి అన్నారు. బలహీన వర్గాల హక్కులను కాలరాసి వారి గొంతులను నులిమేసే కుట్ర జరుగుతోంది.. కెసిఆర్ లెక్కలో ఉన్నత కులాలు 21 శాతం అయితే… నేను చేసిన లెక్కలో ఉన్నతకులాలు 15.28 శాతం మాత్రమేనన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మొగ్గలోనే తుంచేయాలనే కుట్ర జరుగుతోంది అని... ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలి అన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీల పాత్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు.. కోటి రూపాయలతో షోలాపూర్ లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం అన్నారు. ఆర్ధిక, రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ... మీ కోసం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నా అన్నారు రేవంత్ రెడ్డి.